కొబ్బరికాయను కొట్టేది ఎందుకు?:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
 దేవతలను పూజించే టప్పుడు, యజ్ఞ యాగాదుల్లోనూ, శుభకార్యాలలోనూ, కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక.
ఎప్పుడైతే కొబ్బరికాయను దేవత ముందు కొడతామొ, మనం మన యొక్క అహంకారాన్ని వదులుకుంటున్నామని, దాని లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా దేవుని ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ ఒక్క కొబ్బరికాయనే.
కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం. పీచు మనలోని మాంసం. వెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందు లోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు అన్న మాట.


కామెంట్‌లు