హారతి అందుకో భారతి మా ఈ
మంగళ హారతి అందుకో బ్రహ్మసతి
దివ్యమైన ఈ హారతి భవ్యమైన మా హారతి
సదా వెలుగు హారతి ఈ మంగళ హారతి !
మంగళహారతి అందుకో ముందుగా
సూర్యుడు మెచ్చుకొని విందుగా
ఈ హారతి అందుకో మా భారతి
మంగళ హారతి అందుకో సురసతి!
సుప్రభాత మందు మేము మా స్నానమాచరించి
మా నుదుట సింధూర తిలకాన్ని ధరించి
పసుపు కుంకుమలతో ముఖప్రక్షాళనగావించి
మా మనసులో నిన్ను మా మనసారా ధ్యానించి!
అందించే ఈ హారతి అందుకో మా భారతి
నలుదిక్కుల వెలుగునిచ్చు మంగళప్రదమైన హారతి
నీ సన్నిధి చేరుకొని నీ వరమునే కోరుకొని
ధ్యానించి పూజించి అందించే ఈ మంగళ హారతి
మేము అందించే ఈ హారతి అందుకో భారతి
దివ్యమైన ఈ హారతి కులదైవమైన మా భారతి
ఈ మంగళ హారతి మా మంగళ ప్రద హారతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి