పిల్లలూ! ఈరోజు మనం లాభనష్టాలు ఎలా ఏర్పడ్డాయో ఓ చిన్న కథ ద్వారా నేడు తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి.
ఒకసారి దరిద్ర దేవత అయిన జ్యేష్టా దేవికి, ఆమె సోదరీయైన శ్రీ మహాలక్ష్మికి నడుమ తమలో ఎవరు అందగత్తె అనే వివాదం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఈ విషయం తేల్చుకోవడం కై ఒక వాలిజవేత్త దగ్గరకు వెళ్లారు.
ఏమయ్యా వ్యాపారస్తుడా, మా ఇద్దరిలో ఎవరు అందగత్తెనో చెప్పు అని వారు అడిగారు.
చింతపండు ఉందా అని అలిగితే లేదు, అని చెప్పకుండా తాటి బెల్లం ఉంది కావాలా అనే తత్వానికి అలవాటు పడిన ఆ వ్యాపారస్తుడు వచ్చిన వాళ్ళిద్దరూ
ఒకరు దరిద్ర దేవత, మరొకరు శ్రీ మహాలక్ష్మి అని గుర్తించి, వారిని అటు ఇటు నడవమని చెప్పి చివరకు చాలా తెలివిగా వెళ్తుంటే పెద్ద ఆవిడ బాగుంది. వస్తుంటే చిన్నవిడ బాగుంది అని అన్నాడట. అంతటితో ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఆనందించి ఊరుకుంటే బాగుండేది. కానీ
"నేను వెళుతుంటే బాగుంటానా? మరి వెళ్లాలంటే ఒకసారి రావాలి కదా"అని జేష్టా దేవి, నేను వస్తుంటే అందంగా ఉంటానా? మరి రావాలంటే ఒకసారి వెళ్ళాలి కదా అని లక్ష్మీదేవి, అదే పనిగా రాకపోకలు మొదలు పెట్టారట.
దాంతో నిత్య లాభాల పంట అయిన వ్యాపార వ్యవస్థలో లాభనష్టాలు రెండును చోటు చేసుకోవాల్సి వచ్చిందట. ఆ మహానుభావుడి తెలివి తరువాతి తరాల వారికి లాభనష్టాలను రుచి చూపించాల్సి వచ్చిందట. అలా లాభనష్టాలు వ్యాపార వ్యవస్థలో ఆనాటి నుండి ఏర్పడ్డాయన్నమాట. ఇప్పుడు తెలిసిందిగా పిల్లలు మీకు లాభనష్టాలు ఎలా ఏర్పడ్డాయో.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి