ఏం జరుగుతుంది
ఏం జరుగుతుంది
నా పైఎదలోన సఖ
నీ సై మదిలోన ఇక !
చెప్పుకోను రావా
తప్పుకోకు తోవా
వెనువెంటనే రావా
పోదాం మిక గోవా
పదహారేళ్ల వయసు నీది
పైలాపచ్చీసు మనసు నాది
అందుకే మనలో ఈ అలజడి
మన ముందాంలే ఇక కలెబడి !
ఏమంటావు నీవు ఓ బావ
పట్టుకొని వస్తావా నా తోవ
నాజన్మంతా చేస్తా నీకు సేవ
తాళి కట్టి నన్నిక ఏలుకోవా !
నీలో నాలో పెరిగిన ఈ అలజడి
మన ఇద్దరినిక కలిపింది కలెబడి
ఉండవద్దు మనము ఇక తడబడి
ప్రతిపొద్దు చేయాలిగా హడావిడి. !
కలిసిమెలిసి ఉందామిక రా చెలి
అలసి సొలసి ఉండొద్దు ఈ కౌగిలి
అందుకే వచ్చాముగా మనం గోవా
ముందుకే పోవాలి మన ప్రేమ తోవ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి