కోరిక: - కొకట్ల సింధు-తొమ్మిదవ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్- మెదక్ జిల్లా-9640588719
 అనగనగా రామపురి గ్రామంలో లత అనే అమ్మాయి ఉండేది. మూడో తరగతి చదివి మానివేసింది. లతకు చదువుకోవాలని కోరిక బాగుండేది. పేదరికం వల్ల తల్లిదండ్రులు చదివిపించేవారు కాదు. లత మేకల దగ్గరికి వెళ్ళేది. మేకలను బడి గోడ వద్ద మేపుతూ గోడ బయట నుండి తరగతి గదిలోకి చూస్తూ సంతోషపడేది.
           ఒకరోజు లతను గమనించిన ఆనందం మాస్టర్ ఆశ్చర్యపోయాడు. లతను పిలిచి, లత చదువుకోవాలన్న కోరికను తెలుసుకొని, ఆనందం మాస్టర్ ఆశ్చర్యపోతాడు. లతకు కొన్ని పుస్తకాలు ఇస్తాడు. లత మేకలను మేపుతూ చదువుకోసాగింది. వారం రోజుల తర్వాత లతను ఆనందం మాస్టర్ పిలిపించి పుస్తకంలోని ప్రశ్నలు అడుగుతాడు. లత సమాధానం చక్కగా చెబుతుంది. అందరూ ఆనందిస్తారు.
          ఆనందం మాస్టర్ బాగా ఆలోచించి, లత తల్లిదండ్రులతో మాట్లాడి లతను బడికి వచ్చేలా చేస్తాడు. లత బాగా చదివి, మంచి పేరు తెచ్చుకుంటుంది. పై చదువులు చదవలేక మళ్ళీ లతను తల్లిదండ్రులు బడికి మాన్పిస్తారు. కానీ లత మాత్రం మేకలను మేపుతూనే వివిధ రకాల పుస్తకాలు చదువుతుంది. లత యొక్క పట్టుదలను చూసి తల్లిదండ్రులు మళ్లీ ఆనందం మాస్టారు వద్దకు వెళ్లి, లతను చదివిపిస్తామని అన్నారు.  గ్రామస్తుల సహకారంతో ఆనందం మాస్టర్ పట్నంలో లతను కాలేజీలో చేర్పిస్తాడు. లత బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సాధిస్తుంది. గ్రామంలో ఉన్నపాఠశాలకు అనేక సౌకర్యాలు ఏర్పాటు  చేసి, పేదవారు కూడా చదివేలా  చేసింది. లత గ్రామంలో  సహాయ సహకారాలు చేయడం పట్ల ఆనందం మాస్టర్ లత చరిత్రను అందరికీ చెప్తూ సంతోషించసాగాడు.


నీతి: విద్య వల్ల విజయం కలుగుతుంది

 

కామెంట్‌లు