బద్దకాన్ని బంగాళాఖాతంలో వేద్దాం
మనం పుట్టిన దగ్గర నుండి మన సమయాన్ని
మన యవ్వనాన్ని
మన ఎదుగుదలను ఎంతదిగమింగిందోగదా?!
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆత్మావలోకనం
పసితనంలో ఆకతాయితనంతో చదువు పై శ్రద్ధ పెట్టక
బద్దకంతో దోస్తానా ?!
నిత్యం వాయిదా తత్వం
కాలహరణం బ్రతుకంతా పరాజయం
ఓనా ప్రియమైయువకుల్లారా!
బద్దకానికి స్వస్తి పలకండి.
మీ బ్రతుకులను వెలిగించుకోండి
ఎవరు ఎవరికోసం రారు
కడవరకు నీకు నువ్వే తోడునీడైనిలిచేది.
సూర్యున్ని చూసి సమయపాలనను
చెట్టును చూసి పరోపకారాన్ని
పశుపక్ష్యాదులనుచూసి నూతనోత్సాహాన్ని
నిరంతర సాధనను అలవర్చుకో..!?
శత్రువైన బద్దకాన్ని
నీ మేలుకొలుపుతోనే జయించాలి.
రేపు మాపు అనేతత్త్వమే బద్దకాన్ని పెంచి పోషిస్తుంది.
దురాశ లేకుండా చేసే పనిని ఆరాధించు.
శ్రమ జీవన సౌభాగ్యాన్నిమించిన
సంపదమరొకటుండదని గ్రహించు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి