అవినీతి జలగలు అవసరార్థుల రక్తంత్రాగచూస్తున్నాయి
జీతం కన్నా గీతం పై మక్కువ ఎక్కువై
అందించినకాడికి దోచుకుంటున్నారు
దొంగ దొరకనంత కాలం
దొరలా చెలామణి అవుతున్నాడు
ఎవడు తెచ్చాడీ లంచగొండితనాన్ని
ధనికస్వాములు తమ పనులను
అధికారులు త్వరితగతిన పూర్తి
చేయుటకోసమై ఇచ్చిన చిరు కానుకలే
అవినేడు లంచావతారమై
నేడు లక్షలు కోట్లకుచేరుకున్నది
నోట్లు గుప్పి ఓట్లు గొని గద్దెనెక్కిన అమాత్యులు
అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి
జవాబుదారీగా ఉండవలసిన వారు
కానీ
నేడు పదవినే కొనుగోలు చేసిన రాజకీయనాయకులు
అధికారులకు డబ్బు ఆశ చూపి దోపిడీకోరులుగా తయారు చేసారు
ఈ అవస్థల వ్యవస్థలు మారాలంటే
ఉద్యోగులకు జీతభత్యాలు పెంపు చేపట్టాలి
అలవాటుపడిన వారు అవినీతికి పాల్పడితే
ప్రజాక్షేత్రంలో తగు గుణపాఠం చెప్పాలి
ఈ రోజుల్లో అవినీతి అధికారులే ఉద్యోగ విరమణ
తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులుగా
చెలామణి అవుతూ అందినకాడికి
స్వాహాచేసే పన్నాగం పన్నుతున్నారు
ఆహారపదార్థాల్లో
కల్తీ
ఉద్యోగ ఉపాధి రంగాల్లో వ్రేళ్ళూనుకొని
పోయిన అవినీతి తిమింగలాలు
సమర్థపాలన ముసుగులో రాజకీయ నాయకులు
అడ్డుఅదుపులేకుండా గుడిని గుడిలో లింగాన్ని
మటుమాయం చేస్తున్న ప్రబుద్ధుడు
ఈ అవినీతి అంతం కావాలంటే
వస్తుప్రేమలకు మరిగినోళ్ళు
వారి కొచ్చే జీతభత్యాలు సరిపోక ఇలాంటి అడ్డదారిల్లో
డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు
కార్పోరేట్ విద్యాలయాల్లో కల్తీ చదువులు
అర్హతేలేని ఉపాధ్యాయులతో బోధన కొనసాగించడం
కార్పోరేట్ హాస్పిటల్లో నకిలీ డాక్టర్లు,
కల్తీ మందులు తద్వారా అంతుచిక్కని జబ్బులు
దైవ దర్శనాలు కల్తీ
దైవాన్ని కూడా కల్తీమయం చేస్తున్న
ప్రైవేటు గుడులు మజీద్ లు చర్చీలు
భక్తి ముసుగులో భగవంతునికి అవినీతి అంటగడుతున్నాడు
ఒకటేమిటి అన్నీ రంగాల్లో కల్తీ
ఒక మాఫియాగా మారి దేశ భద్రతకు
మరియు దేశ ప్రగతికి అవరోధమై కల్తీ
సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాయి
ఇక్కడ అందంచందం
ఆభరణాలు బట్టలు ఒకటేమిటి కాదేదీ కల్తీకనర్హం
అన్నట్టుగా మారింది
ఈ అవినీతి అనకొండ కోరలు పీకాలంటే
నోటుకు ఓటు రాజకీయం దూరం కావాలి
ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు
జవాబుదారులుగా మసలుకోవాలి
అధికారులు తప్పుడు పనులకు
పాల్పడితే ప్రజాక్షేత్రంలో వెంటనే శిక్ష విధించాలి
అలా చట్టసవరణచేయాలి
అవినీతి మాఫియాను కూకటివేళ్లతో పీకేయాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి