ఉద్యోగ విరమణ (దిగులు మేఘం) :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497

 ముప్పై ఐదేండ్ల ఉపాధ్యాయుడుగా ఉద్యోగ జీవితంలో అత్యవసరం ఉంటే తప్పా
ఆబ్సెంట్ అసలే లేని ఫస్టు క్లాసు విద్యార్థిలాంటోడిని నేను 
బడి మొదటి గంటగొట్టెలోపే బడిలో చేరేది
పిల్లలంతా గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంటే
గతపదేండ్లలోనేను పెంచిన మొక్కల్లా ప్రతిభావంతులై సభ్యతకుసంస్కారానికి ప్రతిరూపమైన విద్యార్థులకు
 ప్రతి నమస్కారం చేసి స్టాఫ్ రూమ్ లోకి చేరాను
రెండో గంట అటుపిమ్మట ప్రేయర్ ఎంతో నిష్ఠతో పిల్లలతో పాటుగా చేసేవాడను
నాకీదే ఆఖరు ప్రేయర్ 
ఈ రోజే నా పదవి విరమణ
 రేపటి నుండి ఈ హడావుడి 
ఈ హంగామా 
అంతా దూరం దూరం 
కిరాణా కొట్టుకి...
దగ్గర దూరపు బంధువుల ఇండ్లకి..
పరుగోపరుగు...
వద్దు లేవే అంటే శ్రీమతి గారు ఊరుకుంటారా!?
ఇన్నాళ్లు బడిబడి అన్నారు ఇప్పుడుఖాళీయేగా
రావడానికేం?!
మాయ రోగం అంటూ ఒకటే గొణుగుడూ
రేపటి విరామ జీవితం ఊహించుకుంటే గుండె పోటు వచ్చేలా ఉంది .
బడీ ఇల్లు తప్పితే లోకం తెలియకుండా బ్రతికాను 
డోంట్ వర్రీ సోదర రిటైర్డ్ ఉపాధ్యాయులారా!?
మనస్సుంటే మార్గాలెన్నో....
చెబుతావినుకో...!?
దేహానికి రిటైర్మెంట్ ఉందేమో 
కానీ 
పడుచు ఆలోచనలకు విరామం లేదుకదా!
చలాకి తనం 
ఆశావాదం 
కలుపుగోలుతనం
పదుగురితలలో నాలుకలా
పసితనపు స్నేహితులతో
ఎంచక్కా 
పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయోచ్చు 
ఉద్యోగ జీవితంలో నెరవేర్చుకోనటువంటి 
స్వీయ హాబీలు 
పెరటి తోట పెంపకం 
చిత్రలేఖనం నేర్చుకోవచ్చు
సంస్కృతం దేవభాషను అవపోసన పట్టొచ్చు 
సత్సాంగత్యం చేయొచ్చు 
ఆరోగ్య పరిరక్షణకై
వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకోవచ్చు 
 మానసిక ఒత్తిడులు అధిగమించుటకు సెటిల్ బ్యాట్ మెంట్ ఆటలాడొచ్చు 
వివిధ రకాల ఫన్నీ గేమ్స్ 
రైమ్స్ నేర్చుకోవచ్చు
ఇది అల్జీమర్స్ ను దూరం చేస్తుంది 
ఇలా ఎన్నో ఎన్నెన్నో 
ఇప్పుడు మొదలెట్టొచ్చు
ఇందుకు ఆరోగ్య పరిరక్షణ అత్యవసరం 
వేళకు భోజనం చేయడం 
సమయానికి నిద్రపోవడం 
అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం
మనకున్నంతలో సాటి వారికి సాయం చేయడం 
వీలైతే ఇరుగుపొరుగునున్న 
పేద పిల్లలకు విద్యాదానం చేయడం
నోట్ పుస్తకాలు 
టెక్స్ట్ బుక్స్ 
యూనిఫాం మొదలగునవి కొనివ్వొచ్చు
యూత్ క్లబ్ తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని మీ పుట్టిన రోజు సందర్భంగా ఊరిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించొచ్చు
ఇంకా మనం పుట్టిన ఊరిలోనే శేషజీవితం గడపాలనుకునే 
ఉద్యోగ విరమణోపాధ్యాయులు
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావొచ్చు
మనస్సుంటే మార్గాలెన్నో...
(ఒక ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ ఫంక్షన్ లో నేను వ్రాసి చదివినది)

కామెంట్‌లు