ఇదేనా నాదేశం!?:- అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగామ-9640748497
ఇదేనా నాదేశం 
వీరే నా నాదేశవాసులు 
నాడు సంస్కృతి సంప్రదాయాలకు నిలయం నాదేశం 
నేడు పాశ్చాత్య విషకౌగిలిలో బంధియైదీదేశం

ఇందుకేనా మనం బ్రిటిష్ వారితో పోరాడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని సంపాధించుకున్నది

ఒకప్పటి వెట్టిచాకిరితో తెలంగాణ పల్లెలఅస్థిత్వాన్ని కోల్పోతే విసుగెత్తిన రైతు కూలీలు 
సాయుధ రైతాంగ పోరాటంచేసి
దున్నెవాడిదే భూమి దొరయేందిరో ఆతడి జులుం ఏందిరో అన్న సామాజిక చైతన్యంనేడు కరువైనది

ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది 

మద్యం ,మాంసం, డ్రగ్స్ 
పసి వయసు నుంచే అలవాటుగా మారింది.
రేపటి తరం ఆయువు మూడకముందే
మృత్యువాత పడుతున్నారు .

దీనంతటికీ ప్రధాన కారణమెవరు?!
దేశ సరిహద్దులను దాటి 
డ్రగ్స్ విదేశీ మద్యం మన దేశంలోకి ఎలావస్తుంది  
ఇక్కడ అధికార యంత్రాంగం అలసత్వమో!?
లేదా చూసి చూడనట్టుగా ఉంటూ
వారి ఆమ్యామ్యాలు వారికే
అందుతున్నాయన్న స్వార్థచింతనా.!?
ఏదేమైనా మంచి మానవత్వం మనుషుల్లో కరువైనది 
నోట్లు తీసుకొని ఓట్లేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృత్వంగా మార్చారు 

ఈ దేశంలో అవినీతికి పాల్పడిన వ్యక్తులు వారు మరణించే వరకు కూడా శిక్షలు అమలు కాకుండా ఉన్న బలహీన చట్టాల మూలంగా దొంగలు దొరల్లా చెలామణి అవుతున్నారు 

నేరచరిత్ర కలవారే రాజకీయ పార్టీల అధినేతలై
ఎన్నికల్లో కులమతాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవడం పరిపాటిగా మారింది 
ఇదీ నేటి భారతం 
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఇదే డబ్బున్నోడికి
అధికారం కట్టబెట్టే నామ్ కే వాస్తే ప్రజాస్వామ్యం 
అంతా వ్యక్తిస్వామ్యమే
అంతా నియంతృత్వమే

కామెంట్‌లు