అడవిలో దట్టంపు పొలాల మధ్యన,
నిలబడి చూస్తుండే పసిడిబాల!
బాలకే మాత్రము భయం లేదనిపించు,
ఆ ఠీవి చూస్తుంటే నిజముగాను!
కెమెరాను చేతిలో పొందిగ్గా పట్టుకొని,
ప్రకృతి దృశ్యాలు తీయుచుండే!
తన వారు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా,
చిత్రాలు చిత్రించు చిన్నదాన్ని,
చూడ ముచ్చటయ్యె ఏమి చెపుదు!
ఆ పిల్లకున్నట్టి ప్రకృతి లాలస,
పెద్దవారికి కూడా ఉండదేమో!
నక్కలు, వేట కుక్కలు తిరగాడే,
ఆ పొలాల్లో ఎలా తిరుగ గలిగే!
తోడేళ్ళు, ఎలుగులు తిరుగాడు వేళది!
భయం లేని బాల ఎవరి బిడ్డో!
ఏది ఏమైనా, ఆ బాల ప్రకృతి శోధన...
ఎన్నదగిన గొప్ప గుణం సుమ్మి!
తల్లిదండ్రు లామెను పట్టించుకోకుంటే,
ఈ క్షణములోనైనా ముప్పు కలిగే...
అవకాశం ఉందని అనిపించుతున్నది...
దేవుడే రక్షగా నిలుచుగాక!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి