ఆడది అంటే అబ్బలని...
వంటింటికే పరిమితమని...
అవసరాలు తీర్చే యంత్రమని...
పిల్లల సాకే పనిమనిషని...
అనుకునే రోజులు పోయాయి!!
అత్తమామల సాధింపులు,
ఆడబిడ్డల అదిలింపులు,
భర్త చేతగాని తనం,
వెనక్కి ఆమెను లాగినా...
డాక్టర్ గా, యాక్టర్ గా, పైలెట్ గా,
ప్రతి రంగంలో ముందుకు పోతూ,
యుద్ధభూమిలో రుద్రమగా...
కవితలుఅల్లుటలో మొల్లగా....
భక్తి భావనలో మీరాబాయి గా...
సేవచేయుటలో సరోజినీలా...
ఆకలి తీర్చుటలో డొక్కా సీతమ్మలా...
అన్నింటా రాణిస్తుంది మహిళ!
తను ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ,
కింది వారికి చేయందిస్తూ,
ఆశయ శిఖరాలు చేరుస్తుంది!
నిచ్చెన ఎక్కిస్తాం కొంతవరకే!
ఆపై, స్వయంకృషితో సాగాలి!
మహిళకు చేయందించే ....
మగవాళ్ళూ ఉన్నారు లోకంలో!
మహిళా అభివృద్ధికి తోడ్పడదాం!
అందరం సమిష్టిగా చేయందిద్దాం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి