కోలాహల దృశ్యం:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు- 9849305871
కాశ్మీరీ అందాలు
డాల్ లేక్ సుందర తీరాలు 
నా దేశం పూసిన చల్లని పరిమళాలు 

అందరినీ బంధాలతో అక్కున చేరదీసే
మట్టి సుగంధాల తోట హైదరాబాద్ 
గగనంలో చుక్కలన్నీ జతగూడిన
ఆబాదీ మనసు అవ్వా అక్కా తమ్మీ జిందాబాద్

ఇప్పుడిక్కడ భాగ్యసిరి
మట్టిలో వీచే గాలిలో మార్దవం   
విశ్వవేదికల ఆకర్షణ కానీ
నేల మందహాసం పరవశంలో 

ప్రవాహ నదులన్నీ ఒక్కదుటున 
మనను తడిపేసే మహోత్సవాలు 
నీకోసం నాకోసం మన వాకిట్ల వాలే
జ్ఞానాన్ని మోసుకొచ్చే అంతరంగాల చేతులు
తమలోకి ఒంపుకొనే అద్వితీయ చూపులు
చేతి ఆభరణం సొగసు
మేధను నింపే ఆలోచన కంపనాలు పూచే 
విన్నాణ జాతరలో ఊరేగే అక్షర గనులు
చూడ తరమా! సూర్యచంద్ర కళాపూర్ణోదయ హేల!

అటు చూడు 
దృశ్య వాహిని రంగులీనిన జ్ఞాన ముల్లె
అంతర్జాతీయ లఘుచిత్ర వెలుగు మెరుపుల మౌన సవ్వడి భాగ్య వేదిక హుస్సేన్ సాగర్ వీధుల
 ఆలోచనల విజ్ఞానం పిల్లల పెద్దలకు
మనోల్లాస అంతర్మథనం 

అయితే
ఎవరి మైదానం వారిది,ఎవరి ఆటా వారిదే
విశ్లేషణ వ్యాఖ్యానోపాఖ్యానాలు నజరానాలకు అందని చింత వింత

ఉట్టిమీది ముంతపై చూపు
వదిలిన బాణం ఆశల పల్లవి అది
బాకాలూదని నాకాలకోసం 
పొద్దు పూచిన చీకటినిద్ర మౌన కుబుసం వీడిన కలల కళలు

ఏదేమైనా
జ్ఞాన దేవాలయంలో కొలువున్న కమ్మలన్నీ 
మట్టి కొమ్మలు ఊగే విజ్ఞాన వీధిలో
గాలి గంధాలు పుస్తకం
కనుల చూసిన కళ!

సినీవాలి చిగురుబోణి రంగులకల
తళతళ జిలుగు రూపసి
అక్షరం ఒరుకులో
జ్ఞాన విజ్ఞాన దృశ్య మానసి 
మానసిక ఆనందాల రెక్కల విపంచి
సినిమా మౌనధ్వని రంగులద్దే ఇరువైనాలుగు కళల సమైక్య క్రతువు...
*&&&*

(హైదరాబాద్ బుక్ ఫేయిర్,హైదరాబాద్ వేదిక, డిసెంబర్ 19,2025.
&
అంతర్జాతీయ చిన్న సినిమా పండుగ,హైదరాబాద్ వేదిక,డిసెంబర్ 19,2025.)సందర్భంలో...

కామెంట్‌లు