ఆశల పూలు పండ్లు విరిసి కాచిన చెట్టు
విస్తరించే నీడలో సేదదీరి
బతుకడమనేదే ఓ గొప్ప కళ!
రాళ్ళూ రప్పల నడకలో చెప్పుల్లేవు దారెంట జోలెలో బతుకు గుర్తులు
పరుగెత్తే అశ్వాల అలరించే పూల భావోద్వేగాలు
సంవేదనల అంపశయ్యపై మధ్యతరగతి నీరు కన్నీరు
ఇక్కడ పిండికొద్ది రొట్టెలా
బతుకడమనేదే గొప్ప కళ.
ముళ్ళను ముద్దాడే గాయాల సంచిలో పుస్తకం చదివిన పేజీలవి
హూందాగా జల్సాలులేని పత్రహరిత గాలిగంధం
జీవన వాహికలో నావ వెలుగు తెరచాప
కన్నీళ్లు తాగిన దాహం మన్ను బుక్కిన ఆకలి బతుకంటే
కాలం నేర్పిన జ్ఞానంలో
బతుకడమనేదే గొప్ప కళ!
కలలు సుందరమై లాగేసేదే సూదంటు రాయి
కరిగిన కథమనసు ఊగేదే
జకుముక రాయి
మంచి చెడుల్లో సుఖదుఃఖాలు నెమలి నాట్యాల బోధనలో
బతుకడమనేదే గొప్ప కళ!
ఆటుపోట్ల కడలి అలల "జలవిద్యుత్" లా
జీవిస్తూ తనివితీర ఆసాంతం జర్రుకొనే మామిడిపండు పిక్కలా
బతుకడమనేదే గొప్ప కళ!.
బతుకంతా స్వేచ్ఛగా ఆలపించే గీతం!
మనిషిని మనిషిగా నిలిపే మైలురాయి
బతుకున బతుకై బతుకడమనేదే 'రేపటి కళ!'.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి