నీకేమి తెలియదు తాతయ్య
అన్న మనుమల మీదనా
మీ రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు
అన్న కడుపున పుట్టిన పిల్లల మీదనా
మాష్టారు మీ మీద మాకు గౌరవమే గాని
దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలన్న
నా దగ్గర చదువుకున్న
ప్రజాప్రతినిధి మీదనా
నైతిక విలువలు చెబుతు
ఆధ్యాత్మిక చింతన మీద
ప్రవచనాలు చేస్తు
అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న
స్వామిజీలు, ప్రవచన కారుల మీదనా
చెప్పిందే చెప్పి చూపించిందే చూపిస్తు
రేటింగ్ కోసమంటున్న
ప్రసార మాధ్యమాల మీదనా
చివరికి ఏభై ఏళ్ళయి నాతో కాపురం చేస్తున్న
నా సహధర్మచారిణి
మీరురుకోండి
మీకేమి తెలియదు ఇంకెన్నాళ్ళుంటాము అంటే
నే చతికిలబడి చూస్తున్నా
లోకం తీరును మార్చలేనని
నాకెవరిమీద కోపం లేదని చెబుతున్నా...!!
......................
ఎవరి మీద నా కోపం?: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.-9963265762
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి