నాన్న మాటలు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
స్ఫూర్తినిచ్చే మాటలు
సుగంధాల తోటలు
అభివృద్ధికి బాటలు
మేలి పసిడి మూటలు 

పదిమందికి స్ఫూర్తిగా
త్యాగమయ క్రొవ్వొత్తిగా
ఉండాలోయ్! జీవితము
పేదోళ్లకు కోటగా

బ్రతకంతా బాటగా
జీవజలపు ఊటగా
తప్పక ఉండాలోయ్! 
ఆదర్శమవ్వాలోయ్!

దారి చూపు గురువుగా
ఉపకరించు తరువుగా
ఇలలోన బ్రతకాలి
దేశకీర్తి నిలపాలి


కామెంట్‌లు