గురుదేవుల నీతి సూక్తులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,సెల్:9966414580
బుద్ధిబలం గొప్పది
భువిలోనే మిన్నది
కల్గియున్న వారికి
క్షేమాన్ని ఇచ్చునది

విలువైనది జ్ఞానము
అభివృద్ధికి మార్గము
కల్గియుంటే గనుక
చేయు స్వర్గధామము

బహు శ్రేష్టము ధ్యానము
చేకూర్చును శాంతము
చేసుకుంటే గనుక
సుభిక్షము జీవితము

పెరగాలి గౌరవము
తరగాలి  గర్వము
ఎదగాలి గొప్పగా
బ్రతకాలి హాయిగా


కామెంట్‌లు