బామ్మ హితవు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
వల్లించుట నీతులు
చూడ సులభతరమే
చూపించుట చేతలు
అత్యంత ముఖ్యమే

ఉండాలి ఆచరణ
బ్రతుకున క్రమశిక్షణ
మనోబలం గొప్పది
అదే కదా రక్షణ

మాట మీద నిలకడ
ఉంటేనే మనుగడ
గుర్తించుము బాధ్యత
ఇవ్వాలోయ్! భద్రత

మనసుపై నియంత్రణ
ఉండాలోయ్! ధారణ
చూపించాలి కరుణ
వృద్ధులపై  ఆదరణ


కామెంట్‌లు