తాతయ్య ప్రబోధం:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
లేకుండా సాధన
పొందలేము విజయము
లేకుంటే వేదన
ఎరుగలేము మోదము

కష్టమైన కార్యము
ఇష్టంగా చేయాలి
చిత్త శుద్ధి ఉంటే
ఏదైనా సులభము

వేయొద్దు వాయిదా
ఉండదోయ్! ఫాయిదా
గుర్తించుకో సదా
లేకపోతే వృథా

ఉండాలి ఆశయము
దానికై ఆరాటము
ఫలితం వచ్చు వరకు
చేయాలి పోరాటము


కామెంట్‌లు