వినయంతో ఒదగాలి:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
హృదయాలను భగవంతుడు
పరిశీలన చేయువాడు
అహంకార హృదయులను
అట్టడుగుకు తొక్కువాడు

జాగ్రత్త  దేవునితో 
ఆడరాదోయ్! ఆటలు
ఉండాలోయ్! భయంతో
బాగుండును కుటుంబాలు

భక్తిలేని జీవితాలు
కాల్చబడిన కాగితాలు
చివరికి మిగులును భస్మము
ఉండనే ఉండదు క్షేమము

దైవ నామ ధ్యానంలో
వారు ఇచ్చు జ్ఞానంలో
జీవితంలో ఎదగాలి
వినయంతో ఒదగాలి


కామెంట్‌లు