వెలకేని ఆత్మీయులు :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
లేకుంటే ఆత్మీయులు
మన క్షేమమే  శూన్యము
వారు పంచే సలహాలు
ఖరీదైన  ముత్యాలు

వారితో ఘన బంధాలు
జాగ్రత్తగా ఉండాలి
అమూల్యమైన స్నేహాలు
ఉన్నతంగా చూడాలి

ఆత్మీయులు మన ఆస్తులు
అనుకుంటే ప్రాణాలు
కష్టాల్లో తోడుగా
ఉంటారోయ్! దుర్గంగా

ఈ సభ్య సమాజంలో
ఘనమైన జీవితంలో
వదలుకోకు ఆత్మీయత
కల్గియుండు అన్యోన్యత


కామెంట్‌లు