చిరునవ్వులు సిరి పువ్వులు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
అందము దరహాసము
ముఖమున మధుమాసము
కల్గియుంటే గనుక
బ్రతుకు ఆనందభరితము

వికసించిన కుసుమాలు
వెలుగులీను దీపాలు
వదనాన మందహాసము
ఘన తేజము, ఉత్తేజము

మోవిని నగవులు చిందిన
హరివిల్లుయై వెలసిన
ముగ్ధమనోహరం కదా
దాన్ని కల్గియుండు సదా

ఆరోగ్య  ప్రదాతలే
ఆయుష్షు కారకాలే
చెదరని చిద్విలాసము
ఆనంద కారణాలే


కామెంట్‌లు