ఉండాలి తప్పకుండా!:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:996641458
కష్టమైన ఏదైనా
ఇష్టంగా భావించు

శరణంటే ఎవరైనా
పూర్తిగా సహకరించు

బ్రతుకున నిజాయితీగా
జీవించి చూపించు
అందరిలో హుందాగా
ఉండేలా వ్యవహరించు

పదిమందికి దీపంగా
ప్రేమకు ప్రతిరూపంగా
ఉండాలి తప్పకుండా
అవనిలో ఆదర్శంగా

పరుల గుట్టు గోప్యంగా
సంస్కారమే గొప్పగా
ఉండాలి జీవితంలో
చూడ తేజోమయంగా

కామెంట్‌లు