నిమ్మగిరి రాజ్యాన్ని జయదేవుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. జయదేవుడికి నెమ్మదితనం ఎక్కువ. ఏ పని చేసిన నెమ్మదిగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటాడు. కొన్ని విషయాల పట్ల అతి నెమ్మదిగా ఉంటాడు. ఒక్కోసారి జయదేవుడు నిర్ణయం తీసుకునే లోపు సమస్య పరిష్కారం జరుగుతుంది. అందరూ కూడా జయదేవుడి నెమ్మదితనం చూసి, క్లిష్ట సమస్యలు మాత్రమే తెలిపేవారు. చిన్న చిన్న సమస్యలు తీసుకవెళ్లేవారు కాదు. వారే పరిష్కరించుకునేవారు.
ఒకసారి రాజ్యంలో అనుకోకుండా అతివృష్టితో బాగా వర్షాలు కురిసాయి. బాగా వరదలు వచ్చి, ఇండ్లలోకి నీళ్ళు వెళ్లాయి. వేగుల ద్వారా సమస్య తెలుసుకున్న జయదేవుడు మౌనంగా ఉండిపోయాడు. ప్రజలంతా ఎలాగు జయదేవుడు తమను కాపాడే ప్రణాళిక వెయ్యరని, ప్రజలంతా ఇరుగుపొరుగు గ్రామాల బంధువుల వద్దకు వెళ్లారు. నాలుగు రోజుల్లో ఇండ్లన్ని పూర్వస్థితికి రాగానే ప్రజలంతా తమ నివాసాలకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మహారాజు జయదేవుడు నివాస ప్రాంతాల వద్దకు వెళ్లాడు. ప్రజలంతా కోపంతో మేము చచ్చామా! బ్రతికామా! అని తెలుసుకోవడానికి వచ్చావా! అంటూ కోపగించారు.
మహారాజు జయదేవుడు చిరునవ్వు నవ్వాడు. ప్రజలు ఇంకా కోపంగా ఊగిపోయారు. జయదేవుడు గట్టిగా నవ్వాడు. ప్రజలంతా ఒక్కసారిగా మౌనం వహించారు. ప్రియమైన ప్రజలారా! ఎంత పెద్ద మహారాజు అయినా అతివృష్టితో వర్షం కురిసినప్పుడు తాను తీసుకునే నిర్ణయంలోపు జరగాల్సిన ప్రమాదం జరుగుతుంది. అందుకే నేను నిర్ణయం తెలిపేలోపు మీరు నిర్ణయం తీసుకుని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అందుకే సమస్యలు వచ్చినప్పుడు ఒక్కోసారి నేను పరిష్కార మార్గం చూపకుండా ఆలస్యం చేయడం మూలంగా మీరే సమస్యలు పరిష్కరించుకొని ఆనందంగా ఉంటున్నారని మహారాజు జయదేవుడు అన్నాడు. ప్రజలు కూడా ఒక్క క్షణం ఆలోచించి, మహారాజు చెప్పిన మాటల్లో నిజాన్ని కూడా గ్రహించారు. ప్రజలు కూడా అప్పటినుంచి అవసరమైన చోట మహారాజు జయదేవుడు వలే ఓపికతో నెమ్మదితనాన్ని అలవర్చుకోసాగారు.
నీతి: నెమ్మదితనం కొన్నిసార్లు ఉపయోగపడుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి