శంకరాచార్య విరచిత - భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లో కం :
క్వణత్కింకిణీనూపురోద్భాసిరత్న-
-ప్రభాలీఢలాక్షార్ద్రపాదాబ్జయుగ్మమ్ ।
అజేశాచ్యుతాద్యైః సురైః సేవ్యమానం
మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి ॥ 3 ॥

పద్యానికి భావార్థం
నీ నడకలో వినిపించే నూపురాల కింకిణి నాదంతో ప్రకాశించే
रत్నాల వెలుగులతో కాంతివిరజిల్లే,
ఒలికే కాంతితో మెరిసే నీ దివ్యమైన పద్మపాద యుగళాన్ని,
బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది సురదేవతలందరూ సేవిస్తూ,
సాశ్రద్ధంగా నమస్కరిస్తూ ఉన్న,
ఓ మహాదేవి! ఆ పవిత్ర పాదాలను నా తలమీద ధ్యానిస్తున్నాను.
లోతైన ఆధ్యాత్మిక అర్థం
క్వణత్కింకిణీ → శక్తి చైతన్యం అంతర్గత నాదరూపంలో అనుభవింపబడుతుంది.
నూపురోద్భాసి రత్నప్రభా → శక్తి స్వరూపం సౌందర్య-ప్రకాశరూపమై ఉండడం.
పాదాబ్జయుగ్మం → దివ్యానుగ్రహం, శరణాగతి, జ్ఞానప్రదాత.
బ్రహ్మ–విష్ణు–ఇంద్రాది సేవ్యమానం → పరాశక్తి దేవతలకూ ఆది మూలం, వారి శక్తి ఆమె నుండే.
మన్మూర్ధ్ని భావయామి → భక్తుని సంపూర్ణ సమర్పణ, ఆత్మ నైవేద్యం.
                 *******
కామెంట్‌లు