అనేక గణితాంశాలకు సూత్రధారి రామానుజన్ అని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో తిరుమలరావు మాట్లాడుతూ అనేక గణిత అంశాలపై పరిశోధనలు చేసిన రామానుజన్ నేటికీ గణిత శాస్త్రవేత్తలకు స్పూర్తిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన గణిత బోధనాభ్యసనా సామగ్రి ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కృత్య సామగ్రి మేళాను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ప్రారంభించారు. పరిశీలించిన అనంతరం ప్రతిభ కనబర్చిన బాలబాలికలకు బహుమతులను అందజేశారు.
గణిత ఉపాధ్యాయులు పడాల సునీల్, గేదెల వెంకట భాస్కరరావు, తదితర ఉపాధ్యాయులు గణిత శాస్త్ర ప్రాధాన్యత గూర్చి ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి