తరం!!:-డా ప్రతాప్ కౌటిళ్యా
నేను ఏ అవతారంలో ఉన్న ఉనికిలోనే ఉన్నాను. 
అవతారాన్ని కోల్పోతానేమో కానీ ఉనికిని కోల్పోను
నాకు నేను స్పృహలోనే ఉన్నానని తెలిపే అవతారం నాది 
ఆ అవతారం తప్ప మరెక్కడ నేను స్పృహలో ఉండలేనేమో!?

ఉనికిని ఉపదేశించేందుకే ఉనికి నాకిచ్చిన అవకాశం 
ఈ నేను.
భాష భావం మాట వ్యక్తీకరణ అనుకరణ నాకోసం 
వీటిని అనువదించాల్సిన అవసరం ఉనికికి ఉండదు 

ఉపయోగం నిజం అవసరం లేని శరీరము ఉనికిది 
కాలంతో పనిలేని పనే లేని ఒక ప్రయాణం కానీ ప్రయాణం ఉనికిది 
ఈ ఒక్క ప్రమాణం ఇద్దరినీ కలిపింది. 

స్థిరం శాశ్వతం నిరంతరం అనే అర్థం లేని యదార్థంలో ఉన్నాను నేను 
రూపం స్వరూపం పోలిక లేని ఉనికికి అపురూపము నేను. 

నిర్మాణం ధ్వంసం ప్రయత్నం వాస్తవం భ్రమ నిర్ధారణలేని నిర్మాణం నాది. 
స్వల్పం అనంతం బహిర్గతం అంతర్గతం అర్థరహితం \
అని నిరూపించాల్సిన ప్రకటించాల్సిన ప్రయోగం కాదు నేను. 
ఒక సందర్భం ఆవిర్భావం నేను. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు