పాఠశాల ఆవరణలో సైకిల్ షెడ్ ను లక్షరూపాయలు వెచ్చించి నిర్మించిన దాత పూర్వ విద్యార్థి నెయిగాపుల వైకుంఠరావు, విద్యార్థులకు ఎంతో సౌకర్యం కల్పించారని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించగా అందులో భాగంగా సైకిల్ షెడ్ నిర్మాణ దాత నెయిగాపుల వైకుంఠరావుకు ఆత్మీయ సత్కారాలు గావించారు. సర్పంచ్ జి.రామారావు, ఎంపిటిసి వి.గోవిందరావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బి.రమేష్, మాజీ సర్పంచ్ వి.ధర్మారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసి సభ్యులు, గ్రామ పౌరులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి