విజ్ఞానం వినాశనకరం కాకూడదు:- కవిమిత్ర,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్
చదువు కుంటే సంస్కారం వస్తుందని

సంస్కారంతో యుక్తా యుక్త విచక్షణ తెలుస్తుందని

విజ్ఞానంతో సమాజ కల్యాణం  జరుగుతుందని అనుకున్నా

నేటి సమాజాన మనిషి సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతో
ఆరచేతిలో పట్టే చరవాణి ద్వారా ప్రపంచ విషయాలను తెలుసుకున్నా

ఆకాశంలో చందమామ పై అడుగిడినా

ద్రవ్యరాశి శక్తినియమాన్ని ఉపయోగించి అణుబాంబు తయారుచేసినా

గుండెమార్పు చేసి ప్రాణరక్షణ చేసినా

యాంత్రిక రోబోలను తయారుచేసి సృష్టికి ప్రతిసృష్టి చేసినా

అధిక్యతకోసం విజ్ఞానంతో తయారుచేసిన అణుబాంబు వినాశనానికి
ఉపయోగించే అధికారం
ఎవరికి లేదు

విజ్ఞానము సమాజకల్యాణం కావాలి
వినాశకరం కాకూడదు

లోకా సమస్తా సుఖినో భవంతు అన్న సనాతన ధర్మాన్ని పాటిద్దాం
వసుధైకానికే ఆదర్శంగా నిలుద్దాం........!!
..................................


కామెంట్‌లు