అందీ అందని మబ్బుల్లో
ఇలను మరచి తేలిపోతూ
ఊరించే ఊహల పల్లకి
ఎక్కి గగన విహారం చేద్దామా.....
పొందిన వాటితో తృప్తిని
పోగేసి మూటకట్టి
పదే పదే తలచుకుని
పొంగే సంతోషం అనుభవిద్దామా..
గుండెల్లో ఉత్సాహం చూసి
నిండుగా నవ్విన కడలికి
చేయి ఊపి సంతోషంగా
అభివాదం చేద్దామా....
సమస్యలతో సర్దుబాట్లు
సమయంతో రాజీలు
సహనంతో సహగమనాలు
ఓర్పుతో మార్పులు చేసుకుందామా...
వద్దనుకుని విసుగును
దిద్దుకున్న మనసుతో
పొద్దుపొడుపు కోసం
ముద్దుగా ఎదురు చూద్దామా...
కనిపించని రేపును
కమనీయంగా మార్చి
కలలు తీరే తరుణాన్ని
కటాక్షించి అందించే వెలుగుకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి