ధారగా కురిసే అనుగ్రహమా?
చేరగా పిలిచే సుర నందనమా?
కోరగా దొరికిన సుధా తరంగమా?
వాలుగా తాకిన మయూఖమా..?
కనకగిరుల జారిన జలపాతమా?
దినకరుని సాగిన కరమా?
వనమున దిగిన వెలుగు వంతెనా?
మనమున నిండిన ఆనందమా?
తూర్పున జరిగిన విస్ఫోటనమా?
నింగిని ఒలికిన కాంచనమా?
ఇలకు దిగిన వెలుతురు విమానమా?
ఇనుని చురుకైన వీక్షణమా?
చరితగ మారిన గతములోని
కలతలన్నీ మరిచే తీరున
భవితను సుందర స్వప్నములా
త్వరితముగా మార్చాలని...
కురిసే కన్నుల నీడలలో
మెరిసే మెరుపులు నిలపాలని
విరిసే వేకువ వెలుగులన్నీ
మురిసే మనసున నింపాలని..
చీకటి తెరలను తొలగించి
రేపటి వెలుగులు పంచుతూ
ఓపటి వరములు గుప్పించే
ముంగిట నిలిచిన దైవానికి
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి