తెల్లవారుజామునే నిద్ర లేవడమంటే సోక్రటీసుకి ఇష్టం ఉండేది కాదు. అయితే తన కుమారుడు ఏదో ఒక రోజు ధనవంతుడైన వ్యాపారిగా మారాలని సోక్రటీస్ తల్లి కలలు కంటూ ఉండేది. అందువల్ల సోక్రటీస్ ఆలస్యంగా లేవడం అంటే అతని తల్లికి నచ్చేది కాదు. ఆ అలవాటు మానుకోవలసిందిగా పొందే పదే చెప్పేది. కానీ కొడుకు తీరులో మార్పు లేదు. అందువల్ల ఒకరోజు ఆమె సోక్రటీసుని ఓ ప్రొఫెసర్ ఇంటికి తీసుకెళ్ళింది. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనం గురించి తన కుమారుడికి చెప్పమంది.
ప్రొఫెసర్ : సోక్రటీస్,
నేను నీకొక మంచి కథ చెప్పబోతున్నాను. దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావో చెప్పు. సరేనా?
సోక్రటీస్ : అలాగేనండి.
ప్రొఫెసర్ : అనగనగా రెండు పక్షులుండేవి. వాటిలో ఒకటి పొద్దున్నే లేచి పురుగులను తిని, మరికొన్ని పురుగులను తుసుకొచ్చి తన పిల్లలకు పెట్టేది. రెండవది ఆలస్యంగా లేచేది. దాంతో దానికి తినడానికి ఏదీ దొరికేది కాదు. ఈ కథ నుంచి నువ్వేం తెలుసుకున్నావో చెప్పు.
సోక్రటీస్ : పొద్దున్నే లేచే పురుగు లను పక్షులు తినేసేది. దీనివల్ల నాకు అర్థమైందేమిటంటే పొద్దున్నే లేచే వాటిని మరొకటి లాగించేస్తాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి