బడిలో విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై చర్చలు జరుపుకునే పండగే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ముఖ్యోద్దేశమని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి అన్నారు. మెగా పీడీఎమ్ వేదికపై ఆమె అధ్యక్ష ఉపన్యాసం చేసారు. స్థానిక సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ, మాజీ సర్పంచ్ పలిశెట్టి సూర్యనారాయణ, స్థానిక యువనేత డి.ధర్మరాజు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, వైస్ చైర్మన్ డొప్ప శ్రీనివాసరావు, గ్రామపెద్దలు పెద్ది సత్యం, పక్కి ప్రహ్లాద, పి.భాస్కరరావు, కొర్నాన వెంకట సీతారాం, మానం ఈశ్వరరావు, పులప శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అతిథులతో పాటు తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులకు ఉపాధ్యాయులంతా స్క్రీన్ పై పాఠశాల విద్యా పథకాలను వీక్షింపజేసారు. విద్యార్థుల బోధనాభ్యసనా సామగ్రి జాదూయి పిఠర కిట్ ప్రదర్శనను తొలుత ఎస్ ఎం సి ఛైర్మన్ సిహెచ్ లక్ష్మి ప్రారంభించారు. విచ్చేసిన వారందరికీ ప్రదర్శన సామగ్రిని చూపి ఉపాధ్యాయులంతా వివరించారు. బాలబాలికలు బత్తుల లిఖిత, డొప్ప రాజేశ్వరి, చిర్రా అమృత, పిల్లల విజయలలిత, శనగల సురేష్ మరియు తల్లిదండ్రులు ప్రసంగించారు. వీరికి అతిథుల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు గుడ్ టచ్ బేడ్ టచ్ కి సంబంధించిన బాలికా ఏలికా అనే స్వీయగీతాన్ని వినిపించారు.
అనంతరం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు చూపి విద్యార్థుల చదువుల స్థాయిని అవగాహన పర్చారు. అందరితో సహపంక్తి భోజనాలు గావించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎంటీఎస్ టీచర్ ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి