పాఠశాల పిల్లలు పుస్తకాలను ఇష్టపడుతూ చదివితేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడు, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. బుధవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజన విరామ సమయంలో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలను అందంగా అలంకరించి, 3 కిలోల కేక్ కట్ చేసి, పిల్లలు సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పాఠశాల చిన్నారులు మంద రిషిత, తన్మయిల చేత కేక్ కట్ చేయించారు. పిల్లలందరూ సంతోషంగా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వారిని అద్భుతంగా తయారు చేస్తున్నామని, త్వరలోనే వారికి రీడింగ్, రైటింగ్ పోటీలు నిర్వహించనున్న ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య,ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
ఇష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు: -రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి