మెరుగుగా వుండే రేపు
మెల్లగా ఆశలు రేపు
జడిగా కురిసే వెలుగు
వడిగా నడిపే అడుగు!
వెనకటి వెతలను చెరిపేస్తూ
రేపటి కోరిక నింపేస్తూ
మాపున కన్న కలలన్నీ
మూపున మూటగా మోస్తూ...
కరిగిన కలలకు ఊరటగా
కలిగిన తృప్తే బాసటగా
కదిలిన సమయం సాక్షిగా
కలిసిన బంధాలే ఆస్తిగా....
ఉత్తేజం నింపే ఊహలతో
ఉత్సాహం నిండిన గుండెతో
ఉన్నతి కోరే ధ్యేయంతో
ఉరుకులు వేసే హృదయంతో
కరిగే క్షణాలలో జీవిస్తూ
మరిగే ఆశల ప్రేమిస్తూ
పెరిగే వయసును స్వాగతిస్తూ
తరిగే ఆయువును గమనిస్తూ...
బాటను చూపే తోడైన
వేకువ నేస్తానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి