అన్నం పెట్టిన చెయ్యి:- మిత్రాజి

 నమస్తే ఈశ్వరన్న 
నమస్తేరా తమ్మీ. ఎలా ఉన్నావురా.
బాగున్నానన్నా 
సర్పంచ్కు పోటీ చేస్తున్నావుట కదనే.
అదేందిరా గట్ల మాట్లాడుతావ్. చేయొద్దా.
యే గట్ల కాదే. గా రామాసామితో పెట్టుకుంటే గెలుస్తావే అని నా మాట.
యేం వానికి కొమ్ములున్నయి కని నాకు లేవా. 
అవును నిజమే ఈశ్వరన్న. వానికి నిజంగానే కొమ్ములున్నయి. వాడికి పైస ఉంది. బలగముంది. వాని చుట్టూ పది మంది మనుషులు ఉన్నరు.వాడు అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటడు. లేకపోతే జుట్టు పట్టుకుంటడు.
ఔను నిజమేరా తమ్మీ నువ్వన్నది. కాని ఇంతకు ఈ అన్న నిలబడితే నువ్వు నాకు ఓటేస్తావా లేదా గది చెప్పురా.
అట్లా గాదె నా ఓటు నీకే యేస్తా గాని ముచ్చట చెబుతున్న. వాడు మంచోడు కాదని.
సరే మంచిగానే చెప్పినవు గని గటువంటోళ్ల మదం అణ గొట్టాలానే  వాడికి పోటీకి భయపడి ఎవరు నిలబడకపోతే నేను నిలబడ్డ తమ్మీ. ఐనా నీ లాంటి తమ్ముళ్లు, అన్నలు నాకు  ఉన్నారనే ధైర్యం నాకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం నాకు వుంది గాబట్టే సర్పంచ్ పదవికి పోటీ చేత్తన్న. 
మంచి పని చేసినవ్ అన్న. తప్పకుండా మా ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు నీకే ఎయ్యిపిస్తానే.
అదేంటీ బావ. మీ తమ్ముడు యేసే నాల్గు ఓట్లతోనే గెలుస్తావా. అప్పుడే ఆడికి వచ్చి వాళ్ళ మాటలు విన్న ఈశ్వరయ్య పక్కింటి మల్లన్న అన్నడు.
గదేం మాట బామ్మర్ది. నీ బావను గెలిపించటానికి నువ్వు నాకు ధీమా ఉన్నావని  నిలబడితే గట్ల మాట్లాడితే నేనేమి చెయ్యాలే మరి. ఇంతకు ముందే నామినేషన్ ఏసోచ్చిన. వద్దంటావా.
నేను వద్దంటే ఉకుంటావా బావ.
ఆ. నిజమే బామ్మర్ది. నీ 
ఇంట్లున్న పది ఓట్లు నాకు రాకపోతే నేనేడ గెలుస్తా. రేపే  విత్డ్రా పెట్టుకుంటా.
నీ గుండె ధైర్యం నాకు తెల్సు బావ. ఏదో అన్నానులే. రేపటినుంచే ఇంటింటికి తిరిగి మేం ప్రచారం చేసి నిన్ను గెలిపిస్తాం బావ.
అదిగో బావ. మన పంతులు ఇటే వస్తున్నాడు.ఓ మాట అడిగి చూడన్నా.
వద్దు మల్లన్న వద్దు. ఆ పంతులు రామసామి మనిషి.
అని ఆ ఊరి యువకుడు సుధాకర్ అన్నాడు.
చూడు సుధాకర్. ఎవరు ఎవరి మనిషి ఐనా మనం మన కోసం ఓటు అడగడం మన బాధ్యత. అని ఈశ్వరన్న అనగానే... అప్పుడే వారి వద్దకు వచ్చిన రామయ్య పంతులు వారిని చూసి చిరునవ్వు నవ్వి..
నువ్వు తప్పకుండ గెలుస్తావు ఈశ్వరన్న అని అనగానే అక్కడున్న వారందరు ఒక్కసారే ఆశ్చర్యపోయారు.
ఔను నిజమే ఈశ్వర్. ఆనాడు నేను  చావు బతుకుల్లో లేవలేని స్థితి లో ఉన్నప్పుడు  నువ్వు నీ చెల్లె పెళ్ళిలో ఉండి కూడా నన్ను ఆస్పత్రి కి తీసుకెళ్లి జాయిన్ చేశావు. నీ మేలు నేనేట్లు మర్చిపోతాను
ఆ టైమ్లో ఎవరైనా  చేస్తారు పంతులు. నేను కొత్తగా చేసిందేమిలేదు అని ఈశ్వరన్న అనగానే......
గట్లంటవేమిటయ్యా. అందరూ చూస్తున్నారే తప్పా ఎవరైనా ముందుకొచ్చిండ్రా. గీ పంతులుకు గిప్పుడే రోగం రావాల్నా మా ఖర్మ కాకపొతే.....
ఒరేయ్ ఈశ్వర్ వేరే పంతులుకు ఫోన్ చేసి పిలిపియ్యి అంటున్నారే తప్పా నా బాధ ఎవరైనా చూసిండ్రా.గా వీరసామి తనకేమి పట్టనట్లు పెళ్లి లోంచి ఎల్లిపోయిండు గని నా గురించి పట్టించుకున్నాడా. నేనీ ఊరి పంతులును కానా నువ్వు నన్ను చటుక్కున లేవదీసి కార్లో కూసుండ బెట్టుకుని దవాఖాన కు తీసుకెళ్ళకపోతే నేను బతికేవాన్నే కాదు. అందుకే నీ లాంటి వాళ్ళు మన ఊరికి కావాలె.అందుకే మా ఇంట్లో ఉన్న ఐదు ఓట్లే కాదు అందర్నీ కూడగట్టుకుని నీకే ఓట్లేసి గెలిపించుకుంటా అనంగానే 
అందరూ సంతోషంగా నీ దీవెనలు మాకు కావాలె పంతులు అంటూ ఆ పంతులుకు దండం పెట్టిండ్రు.
మంచిగ సెప్పినవు పంతులు. 
ఈశ్వర్ గాడే లేకపోతె మన ఊరికి rtc బస్సులే రాకపోతుండే. ఊళ్ళో కరెంట్ బుల్బులు వెల్గకపోతుండే.అటువంటి యువకుడే మనకు ఇప్పుడు కావాలె పెద్దమనిషిగా. ఆ వీరాస్వామి పైసలు ఉన్నాయి గదాని విర్రవీగుతున్నాడు గాని. వాని పప్పులేమి ఉడకవు. వాడెంత ఖర్చు పెట్టినా లాస్ట్ కు అందరూ ఇటే మర్లుతారు ఈశ్వరా. ఊరుకు తెలుసు ఎవరు మంచోళ్ళో. ఎవరు చెడ్డోల్లో. అన్నం పెట్టిన  చెయ్యిని మన ఊరు తల్లి మరువదిరా ఈశ్వరా. నువ్వే మా సర్పంచ్.

కామెంట్‌లు