కోగంటి సిస్టర్స్ శ్రీమతి ఉషారాణి శ్రీమతి శాంతిశ్రీ స్థాపించిన "గౌతమ్ బుద్ధ పౌండేషన్" ఆవిర్భావ వేడుకలు శనివారం రవీంద్ర భారతిలో కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగాయిఈ సభకు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా హాజరై కోగంటి సిస్టర్స్ ఉషా రాణి రచించిన "ఉషోదయ సాహితి కిరణాలు" శాంతిశ్రీ వ్రాసిన "నిశ్శబ్ద శాంతి గీతం" పుస్తకాలను ఆవిష్కరణ చేశారు డా. రాధా కుసుమ సంక్షిప్త సుందరంగా సమీక్ష చేశారుఈ సందర్భంగా రవీంద్రబాబు సమన్వయకర్తగా నిర్వహించిన కవి సమ్మేళనంలో హైదరాబాద్ అత్తాపూర్ నివాసి ప్రముఖ కవి రచయితపోలయ్య కూకట్లపల్లి పాల్గొని " జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" కవితను గానం చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు
తదనంతరం డా.బిక్కి కృష్ణ డా. జల్దీ విద్యాధర్ డా. విజయలక్ష్మి పండిట్ కోగంటి సిస్టర్స్ ఉషారాణి శాంతిశ్రీ పోలయ్య కవి కూకట్లపల్లిని ఘనంగా సన్మానించారు. ఈ సభకు ఆత్మీయ అతిథులుగా డాక్టర్ వి.డి రాజగోపాల్ చీకోలు సుందరయ్య హాజరై ప్రసంగించారుఈ సభలో కోగంటి సిస్టర్స్ అనేకమంది కవులకు కళాకారులకు గౌతమ్ బుద్ధ జ్ఞానరత్న పురస్కారాలను అందజేశారు ఆత్మీయ విందుతో
సభ దిగ్విజయంగా ముగిసింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి