కళంకం అంటే మచ్చ!
అదో మాయని మరక!
ఒంటికి మసి అంటుకుంటే,
తుడిస్తే పోతుంది!
బట్టకు డాగు అంటితే,
ఉతికితే పోతుంది!
ఈర్ష్యా ద్వేషాలతో...
ఎదుటివారు బాగుంటే,
చూడలేని కొందరు...
అన్యాయంగా అంటించే,
అపనిందే ఈ మరక!
అన్నా చెల్లెళ్ళు ఒక చోటుంటే,
అక్రమ సంబంధం మోపుతారు!
వదినా మరుదులు కలిసి ఉంటే,
చెడిపోయారని చాటుతారు!
చాకలి తిప్పడేమో....
తప్పతాగి వాగితే,
శంకించెను శ్రీరాముడు!
మీరాబాయినే పాతకి అని,
నింద మోపె సమాజం!
కళంక బాధిత కుటుంబాలు...
ఆత్మహత్యకు గురవుతుంటే,
కళంకితలే ఎదుటివారిపై...
నిందమోపి తిరుగుతుంటే,
దండించలేమా..అట్టివారిని?
నిజానిజాలు శోధించి,
నిందారోపకులందరినీ,
చెరసాలలో బంధించాలి!
అప్పుడే దేశమాత...
ప్రశాంతంగా నిదరోతుంది!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి