మనసు పొరలలో నిక్షిప్తమైన
అపురూపమైన అనుభూతిలా
అందరికీ అందక ఊరించే
అందిన అందమైన అద్భుతంలా...
కొండల అవతల విరిసే
వెలుతురు పువ్వు నవ్వుతూ
వేకువనే పంచిపెట్టే
వెలుగుల పరిమళం లా...
చీకటి దారిన నడుస్తూ
దిక్కులు తెలియని సమయంలో
చుక్కలా మెరుస్తూ కనపడే
గోరంత దీపంలా.....
వెన్నుతట్టి నీ వెంట
దన్నుగా ఉంటానంటూ
తెలియని ధైర్యం ఇచ్చే
భుజం మీది చేయలా....
కమ్మేసిన పొగమంచంటి
చుట్టుముట్టిన సమస్యలను
మట్టు పెట్టే నులివెచ్చని
కిరణపు కరవాలంలా...
నీమముగా ఏతెంచి
నిలువకనే పయనమొనర్చే
కాలపు దారిని సాగి
కనులవిందు చేసే కనకరధానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి