.భూమి భద్రతా : - . కోరాడ నరసింహా రావు!
పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలతో...! 
    భూమి భద్రతను కోల్పోయింది...!! 

పర్యా వరణం రోగ గ్రస్తమైపోయింది...! 
 ప్రపంచ0 ప్రమాదపు అం చుకు చెరుకుంది... !! 

మనిషి అతి సుఖాభిలాష 
  దుఃఖ సాగరం లోకి నెట్టేసింది...! 

నింగి, నేల, నీరు, గాలి రోగ  గ్రస్థమై .... 
  అతివృష్ఠి , అనావృష్ఠి ... 
జల ప్రళయాలు,భూకంపా లు
  భూగోళం  అగ్ని గోళమే
  ఐపోతోంది...! 
   
కలి యుగ ప్రధమ పాదంలోనే ఇలా వుంటే... 
   ఇంకా మూడు పాదాలు
 ఆ జీవన్మరణ నరక బాధలు ... 
 ఎలా అనుభవించగలం... 
 సర్వేశ్వరా... నీవే దిక్కుయని  ప్రార్ధించినా.... 
   యే ఈశ్వరుడూ మనల రక్షించ లేడు... ఇది సత్యము...! 
  ఇదే... సత్యము...!! 
        ****


కామెంట్‌లు