చిట్టి ఉడుత !!:- శాంతి కృష్ణ
చెట్టు పైన చిట్టి ఉడుత 
కిందికి నువ్వు దిగుతావా!

చక్కెర మిఠాయి తినిపిస్తాను 
ఆటలు నాతో ఆడుతావా! 

అద్దాల గౌను కొనిపెడతాను 
అల్లరి పాటలు నేర్పిస్తావా! 

ఐస్క్రీమ్ బండి ఇక్కడ ఉంది 
చప్పున నువ్వు వస్తావా!

పుల్ల ఐసును చల్లగ తిందాం 
నాతో నువ్వు ఉంటావా!

జామతోటకు పరుగున వెళ్దాం 
వడివడిగా కదిలొస్తావా!

జామ పండ్లను పంచుకు తిందాం 
నాతో చెలిమిని చేస్తావా !!


కామెంట్‌లు