రవీంద్ర భారతిలో "గిజిగాని గూడు" పుస్తకావిష్కరణ


 నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె  జడ్పీ హైస్కూల్లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న విరచిత "గిజిగాని గూడు" పుస్తకావిష్కరణ రవీంద్ర భారతి, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.కాలిఫోర్నియా  వీక్షణం 160వ సాహితీ సమావేశం సందర్బంగా అమెరికా నివాసులు డా. గీతామాధురి, ప్రముఖ తెలుగు నటులు సుబ్బరాయ శర్మ,సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్,ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చేతుల మీద పుస్తకావిష్కరణ జరుగడం గమనార్హం..అనంతరం బహు గ్రంథకర్త (87)గద్వాల సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు,సాదనాల వెంకటస్వామి,డా. రాధా కుసుమ మున్నగు వారు.పాల్గొన్నారు.పుస్తక రచయిత గద్వాల సోమన్నను శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు ఉపాధ్యాయులందరూ అభినందించారు.
కామెంట్‌లు