భారతరాజకీయ చరిత్రలో
మచ్చలేని ,నిష్కళంక, నిరూపన నాయకుడాయన.
సమాజహితమే నాహితమని
మొక్కవోని అకుంఠిత దీక్షతో
అలుపెరుగని అసమాన సేవాతాత్పరతతో
ఆజన్మబ్రహ్మచారిగా బంధనములు లేక
ఈర్ష్య అసూయలు దరిచేరనీయక
వాక్ చాతుర్యంతో, కవిహృదయంతో
ప్రతిపక్షంలో ఉన్న
అధికారంలో ఉన్న అందరిమన్ననలు పొందిన
అటల్ బిహారి వాజ్ పాయ్
మీరు ప్రజల మనసులో చిరస్మరణీయులు.
ఇంతితై వటుడింతై అన్నట్లు
ప్రతిపక్షనేతగా, మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ జనతాపార్టీ మురార్జీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖామంత్రిగా
అధ్బుతంగా పనిచేసి
అందరిమన్ననలు పొందిన
మీరు నిజాయితీ కి నిలువెత్తు దర్పణమే.
ప్రధానమంత్రిగా ధైర్యంగా పొక్రాన్ అణు పరీక్షద్వారా
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో
అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టి
రహదారుల విస్తరణ
స్త్రీ ,అనాథ పిల్లల సంక్షేమ పథకాలు ,
అటల్ యోజన వంటి అనేక పథకాలు
ప్రవేశపెట్టిన వాజ్ పాయ్ గారు
మీరు భగవద్గీత లో శ్రీకృష్ణపరమాత్మ
చెప్పిన స్థితప్రజ్ఞతకు ప్రతీకయే
అత్యున్నత భారతరత్న పురస్కారానికే వన్నె తెచ్చిన
మీరు భారతమాత మణిరత్నమే
అందుకోండి అజాతశత్రువు వాజ్ పాయ్ గారు
మీ శతజన్మదినోత్సవ సందర్భంగా నా అక్షరాంజలులు...!
(భారతరత్న
అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జన్మదినోత్సవ సందర్భంగా వ్రాసినది)
వందే మాతరం.భారతమాతకి జై

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి