పెళ్లి ఎవరికి!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా.
పూర్వకాలంలో మనుషులు ఇద్దరుగా జీవించేవారు వారు ఆడ మగ. ఆది నుంచి ఆడవాళ్లు మనుషులుగా కాక ఆడగానే బ్రతికారు. అనాది నుంచి ఆడది అంటే- ద్వితీయ పౌరురాలు- గానే మిగిలిపోయింది. పూర్వం ఆడవాళ్లు ఇంటి పనులు వంట పనులు చూసుకుంటూ పిల్లల్ని కనే యంత్రాలు గానే మిగిలిపోయారు. నిజానికి పెళ్లి అవసరమైంది ఆడవాళ్లకే అప్పటికి -ఎందుకంటే ఆడవాళ్లకు అవకాశాలు తక్కువ వికాసం విద్య తక్కువ నైపుణ్యాలు మెలుకువలు తక్కువ శారీరకంగా బలము దారుడ్యంము తక్కువ అందువల్ల ఆడవాళ్లు మగవాళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. అంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల పిల్లల్ని కనాల్సి వచ్చింది.. అప్పటికి ఆడవాళ్లు అంటే పని పాట లేని పిల్లల్ని కనే మనుషులుగానే మిగిలిపోయారు. కేవలం వంట ఇంటి పని మనుషులుగానే మిగిలిపోయారు. అందుకు తగ్గట్లుగానే ఆడవాళ్లకు పెళ్లి అవసరమైంది మగవాళ్ళపై ఆధారపడాల్సి నా అవసరం ఏర్పడింది. ఇదే పెళ్లి పుట్టుకకు ముఖ్యమైన కారణం గా మారింది.
 
: కానీ ఇప్పుడు అలా కాదు ఆడవాళ్లు ఉన్నత విద్యావంతులవుతున్నారు ఉన్నత పదవులు పొందుతున్నారు. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప నైపుణ్యాలు మెళుకువలు కలిగి ఉన్నారు. చేతినిండా పని ఉంది. సమయం సరిపోనంత తీరిక లేకుండా ఉండగలిగినంత బిజీగా ఉన్నారు. క్వాలిటీ లైఫ్- క్వాలిటీ జీవనశైలిని కలిగి ఉన్నారు. పిల్లల్ని కనే యంత్రాలుగా కాక పని మనుషులుగా కాక గొప్ప  మనుషులుగా బ్రతకగలిగే స్థాయిలో ఉన్నారు. కనుక ఇప్పటి మహిళలకు పెళ్లి సెకండరీ మాత్రమే. తీరిక లేనంత గొప్పగా బ్రతకగలిగిన ఆడవాళ్లు పెళ్లి చేసుకొని పని మనుషులుగా పిల్లల్ని కనే యంత్రాలుగా బ్రతకాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు. నిజానికి వాళ్లకి పెళ్లి అవసరం లేదు. పెళ్లి సెకండరీ మాత్రమే. ఇన్నాళ్లు మగాళ్లు ఎలా స్వేచ్ఛగా బ్రతికారో ఆడవాళ్లు కూడా అలా బ్రతికే అవకాశాలు సౌకర్యాలు వనరులు వసతులు అన్ని వాళ్లకు అందుబాటులో ఉన్నాయి. విలువలు సామాజిక గౌరవం అంటూ కూర్చుంటే మళ్ళీ ఆడవాళ్లు పెళ్లి పేరు మీద బానిసలుగా పని మనుషులుగా పిల్లలు కానీ యంత్రాలుగా బ్రతకాల్చి వస్తుంది. పెళ్లి ఒక అవకాశం మాత్రమే అవసరం కాదు. 
డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు