గీత పుట్టెను మానవుల తల రాతలనె మార్చగ! :- .. కోరాడ నరసింహా రావు!
సాక్షాత్ శ్రీ మహా విష్ణువే అవతరించెను... ! 
 ఈ ప్రపంచమునకు గీతను బోధించగ...!! 

ధర్మమును రక్షించగ యుగ యుగ మునా 
అవతరించెను యుగ పురుషుడై తాను! 

సదా లోక విషయములే తలచగా కామము పుట్టు నని... 
ఆ కామము వలననే క్రోధముజనియించుననియు, ఆ క్రోధమునకు
వశ్యులవగా జ్ఞాపకశక్తి  తగ్గి, దాని మూలమున బుద్దిపనిచేయక... 
మనిషి తుదకు సమ్మూల ముగా నాశనమై పోవు ననెను ! 

మానవుల కవసర మైన 
సంపూర్ణ జ్ఞానమును... 
పరమాత్మ కేవలమొక గీ తలో బోధించెను...!! 

గీతయే జ్ఞానామృతమ్ము... 
 గ్రోలిన వారికి... 
  జనన,మరణము లుండవు..! 
  ********


కామెంట్‌లు