విద్యాపురి ఉన్నత పాఠశాలలో శ్రుతి, లయ అనే అమ్మాయిలు ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చాలా తెలివైన అమ్మాయిలు. చదువులో ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంక్ వస్తారో చెప్పడం కష్టం. మొదట్లో ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. హారిక అనే అమ్మాయి చదువులో అంతంత మాత్రమే. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినదు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుల కళ్ళు కప్పి, తోటి విద్యార్థులతో మాట్లాడుతూ జోకులు వేస్తూ వారిని పాఠం విననివ్వకుండా చేసేది హారిక. హారిక అల్లరి చేస్తున్నట్లు కనిపించదు. హారిక మూలంగా తోటి అమ్మాయిలు తరచూ తిట్లు తినేవారు. అన్యోన్యంగా ఉండే స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి, వారి మధ్య గొడవలు పెంచి వినోదించడం హారికకు అలవాటు.
హారిక లయతో స్నేహం కలిపింది. "చూశావా లయా! ఆ శ్రుతి ఈసారి పరీక్షలలో మొదటి ర్యాంకు వచ్చిందని ఒకటే గర్వపడుతుంది. మా వంటి చదువురాని వారిని చదువులో ప్రోత్సహించవచ్చు కదా! మా మీద చులకన భావంతో మాతో అస్సలు మాట్లాడదు. అందుకే అలాంటి పొగరుబోతులకు దూరంగా ఉంటాను. అందరూ దూరంగా ఉంటే మంచిది." అని చెప్పింది హారిక. మాలినీ అనే అమ్మాయి లయను చేరి, "చూశావా లయా! ఆ శ్రుతితో మీరిద్దరూ ఎప్పుడూ పోటాపోటీగా చదువుతారు, ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పలేం, మీలా చదువులో పోటీ పడేవారు స్నేహభావంతో ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది అంటే 'స్నేహమా? అలా నటిస్తుంది శ్రుతి. దాని మనసులో నా మీద ఈర్ష్య బీభత్సంగా ఉంటుంది.' అంటుంది శ్రుతి. శ్రుతికి దూరంగా ఉంటే నీకే మంచిది" అని చెప్పింది. ఈ మాటలు మాలినితో హారిక చెప్పించింది. ఈ విధంగా శ్రుతిలయల మధ్య చిచ్చు పెట్టడానికి హారిక శతవిధాలా ప్రయత్నించింది.
క్రమంగా లయ శ్రుతితో మాటలు తగ్గిస్తూ చివరకు పూర్తిగా మాటలు మానేసింది. ప్రీ ఫైనల్స్ సమీపిస్తున్నాయి. లయ హారికను పిలిచి, ఇద్దరం కలసి చదువుదామా? అన్నది. "ఎప్పుడూ చదువేనా? నీకు ఎలాగూ మొత్తం సిలబస్ నోటికి వచ్చింది. మనం కలుసుకునేది కొద్ది రోజులే. కాబట్టి కరవు తీరా ఆడుకుందాం. ఎలాగూ నువ్వే ఫస్ట్ వస్తావు." అన్నది హారిక. "మరి ఆ శ్రుతి ఫస్ట్ వస్తే?" అన్నది లయ. "దాని మొహం. లాస్ట్ టైం కాపీలు కొట్టి ఫస్ట్ వచ్చింది. ఈ ప్రీ ఫైనల్స్ స్ట్రిక్టుగా అవుతాయి. నీ చేతిలో శ్రుతి చిత్తుగా ఓడిపోతుంది." అన్నది హారిక. "మా అమ్మా నాన్నలు తిడతారు. నేను పరీక్షల సమయంలో ఇంటివద్ద ఉండి చదవాలి." అన్నది లయ.
ప్రీ ఫైనల్స్ ఫలితాలలో లయ ఫస్ట్, శ్రుతి సెకండ్ ర్యాంక్ వచ్చింది. శ్రుతి లయను చేరి, ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అభినందించింది. మరునాడు శ్రుతి లయ కోసం చాలా ఖరీదైన పెద్ద రామాయణం పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. "ఇది మన స్నేహానికి గుర్తుగా శాశ్వతంగా ఉంచుకోవాలి." అన్నది. లయ బోరున ఏడ్చింది. శ్రుతికి కూడా ఏదైనా మంచి బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంది. అదే సమయంలో హారిక వాళ్ల అమ్మ ఏదో పని మీద హారిక కోసం వచ్చింది. ఇద్దరి స్నేహాన్ని చూసి అభినందించింది. "స్నేహితులు అంటే మీలా ఉండాలి." అన్నది. "హారిక వాళ్ల అమ్మ మీరా?" అని పాఠశాలలో హారిక ప్రవర్తన గురించి పూసగుచ్చినట్లు చెప్పారు శ్రుతిలయలు. హారిక వంకర బుద్ధిని మార్చి చదువులో మునిగేట్లు చేయమని వేడుకున్నారు. "ఇంటికి వెళ్లాక దాని సంగతి చెబుతా." అన్నది హారిక వాళ్ల అమ్మ. ఆమె వెళ్ళగానే శ్రుతిలయలు హారిక వైపు చూసి హేళనగా నవ్వారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి