కలమే...
హలమైతే
కవి…మట్టిగుండెల్లో
మొలకెత్తే మొక్కౌతాడు
రెక్కలు కట్టుకొని
చుక్కలలోకంలో విహరిస్తాడు..!
కలమే..
త్రిశూలమైతే...
కవి… త్రినేత్రుడై
అంధుల కామాంధుల
గుండెల్లో త్రిశూలం గుచ్చి
గురువౌవుతాడు...
గుణపాఠాలు నేర్పుతాడు...!
కలమే...
గాలమైతే..?
కవి…అధికార మదంతో
స్వేచ్ఛగా తిరిగే అవినీతి
తిమింగలాలకు వేటగాడౌతాడు..!
కలమే...
వజ్రాయుధమైతే..?
కవి…అణచివేతల
పంజాలలో చిక్కుకున్న
అమాయకపు
ప్రాణాలకు రక్షణ కవచమౌతాడు..!
కలమే...
అణుబాంబైతే
కవి…అగ్నిజ్వాలలు పుట్టిస్తాడు...
మనిషిలోని కాఠిన్యాన్ని కాల్చేసి
కుళ్ళిపోయిన ఈ సమాజాన్ని
పునీత జలధారలతో శుద్ది లోచేస్తాడు
నవసమాజ
నిర్మాణానికి పునాదిరాయి ఔతాడు..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి