1942లో ఒక భక్తుడు తిరువణ్ణామలై లోని ఆశ్రమానికి వచ్చారు. అయితే భగవాన్ రమణ మహర్షి కొండ మీదకు వెళ్ళినట్లు తెలిసిందా భక్తుడికి. రమణులవారు ఎలాగూ కిందకు దిగి వస్తారని ఓ చోట నిరీక్షించాడా భక్తుడు. అనుకున్నట్లే రమణులవారు వస్తున్నారు.
తీరా ఏదో ధ్యాసలో ఉన్న ఆ భక్తుడు రమణులవారు రావటం గుర్తించలేదు. అయితే ఉన్నట్లుండి కళ్ళెదుట "సూర్యప్రకాశం"లా ఓ వెలుగు రేఖ. ఆ భక్తుడు తలెత్తి చూడగా తన ముందున్నది భగవాన్ రమణ మహర్షి అని ఆశ్చర్యపోయారు. భక్తుడిని చూసి రమణులవారి నుంచి ఓ చిరునవ్వు. ఆ క్షణంలోనే భక్తుడి హృదయంలో అప్పటివరకు పొందని ఓ అనుభూతి. మాటలకందని ఆనందం. జ్ఞానసూర్యుడు భగవాన్. ఆయనే తేజస్సు. ఆయనే జ్ఞానాగ్ని అని గ్రహించానని భక్తుడు మనసులో అనుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి