నీలో మానవత్వమెక్కడ? :- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్
మూడేళ్ళ చిరుప్రాయమే
లోకంపోకడ తెలియని అమాయకకత్వమే
పాలుగారే పసిడి బొమ్మయే
పరమాత్ముని ప్రతిరూపమే
అపరంజి బొమ్మలా
బుడి బుడి నడకలతో
చిలుక పలుకులతో
అంకుల్ అంకుల్ అని వస్తే
మృగం కన్నా హీనంగా
రాక్షసప్రవృత్తి కలిగి
వికసిస్తున్న అందమైన గులాబికి రెక్కలు తీసినట్లు
నీ కామవాంఛ కు
ఘోరంగా బలిచేసావే
అమాయకమైన ఆమె చూపు
బాధతో విలవిల లాడుతు
అమ్మా అమ్మా అన్న ఆర్తనాదం వినిపించలేదా
నీ కెలా చేతులొచ్చాయి
నరరూప రాక్షసుడుగా మారిన
నీలో మానవత్వమెక్కడ?
...............................


కామెంట్‌లు