ఘనంగా శ్రీమద్భాగవతా జయంతి వారోత్సవాలు

 ఆగూరులో ఆద్యాత్మిక ప్రవచనాలతో భక్తబృందం పులకరించి పోయారు. గ్రామంలో గల శ్రీసత్యసాయి మందిరాన శ్రీమద్భాగవతా జయంతి సందర్భంగా వారంరోజుల పాటు ఘనంగా వేడుకలు జరిగాయి. తొలుత ఈ ఉత్సవాలను తెలుగు భాషా పండితులు ముదిల శంకరరావు ప్రారంభించారు. నిర్వాహకకమిటీ సభ్యులు జి.నాగేశ్వరరావు, దామెర వెంకట అప్పారావు, కోనారి అప్పారావు, ఎస్.వి.పాపిశెట్టి, నక్కెట్ల అప్పన్న, కొవ్వాడ సాయిరాం, బల్లా ముత్యాలు, దేశెట్టి అన్నపూర్ణ, దేశెట్టి లక్ష్మీల  ఆధ్వర్యంలో ఘనంగా ఆద్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ గీతా జయంతి సందర్భోచిత ప్రవచనాలను గంటా నాగేశ్వరరావు, ముదిల శంకరరావు, సత్యవరపు వెంకట పాపిశెట్టిలు భక్తజనులకు వినిపించారు. లఘున్యాస పూర్వక రుద్రారాధన, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ మద్భగవద్గీతా పారాయణం మరియు శ్రీ రుక్మిణీ కళ్యాణం ప్రవచనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. అనంతరం గీతా ఆశ్రమంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది.
కామెంట్‌లు