కథల విలువ : - సరికొండ శ్రీనివాసరాజు
 వేంకటేశం మాస్టారు అంటే చాలా మంది విద్యార్థులకు చాలా ఇష్టం. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు. గానం, చిత్ర లేఖనం, నాట్యం వంటి అనేక కళలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. కథలు బాగా చెప్పేవాడు ఉపాధ్యాయులు వేంకటేశం గారు. చదువులో పోటీలు పెట్టి రాణించిన వారికి మంచి పెన్నులను బహుమతిగా ఇచ్చేవాడు. 
     ఒకరోజు వేంకటేశం గారు తన విద్యార్థులను వారు తీరిక సమయాలలో ఏం చేస్తుంటారో అడిగారు. నిజాయితీగా చెప్పమని, తనకు ఆ సమాధానాలు నచ్చక పోయినా తాను ఏమీ అననని అన్నారు ఉపాధ్యాయుడు. విద్యార్థులు చాలా స్వేచ్ఛగా సమాధానాలు చెప్పారు. ఎక్కువ మంది టీవీలు చూస్తామని, సెల్ ఫోన్లతో ఆదుకుంటామని, క్రికెట్ ఆడుతామని సమాధానం చెప్పారు. బాగా బాధ పడ్దారు వేంకటేశ్వరం గారు. 
      వేంకటేశ్వరం మాస్టర్ చాలా కథల పుస్తకాలు క్రమం తప్పకుండా కొంటారు. అవి అనంతంగా ఉన్నాయి. వేంకటేశ్వరం గారు తన ఆలోచన మార్చుకున్నారు. చదువులో పోటీలు పెట్టి తన దగ్గర ఉన్న మంచి కథల పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నారు. కథల విలువ గురించి వివరంగా చెప్పారు. వేంకటేశ్వరం గారి మీద విద్యార్థులకు విపరీతమైన అభివానం కాబట్టి బహుమతిగా ఇస్తున్న కథలను చదువుతున్నారు. మిగిలిన విద్యార్థులకు ఆ కథలు ఎంత బాగున్నాయో చెబుతున్నారు. చాలామంది విద్యార్థులకు కథల విలువ తెలిసి వచ్చింది. తీరిక సమయాలలో కథల పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నారు.

కామెంట్‌లు